Sunday, May 8, 2011

'100% లవ్'

చిత్రం:'100% లవ్'
సంస్థ: గీతా ఆర్ట్స్‌
నటీనటులు: నాగచైతన్య, తమన్నా, తషా, నరేష్‌, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కె.ఆర్‌.విజయ, విజయ్‌కుమార్‌, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు.
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌
నిర్మాత: బన్నీ వాసు
రచన-దర్శకత్వం: సుకుమార్‌

కథ:పరిచయ చిత్రం జోష్ ప్లాప్..ఆ తర్వాత వచ్చిన ఏ మాయ చేసావే సూపర్ హిట్ అయినా ఆ క్రెడిట్ మొత్తం సమంతకు కొట్టేసింది. దాంతో నాగచైతన్య తనను తాను ప్రూవ్ చేసుకోవటం కోసం ఈ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరో ప్రక్క జగడం, ఆర్య 2 చిత్రాలు దర్సకుడుగా పేరు తెచ్చిపెట్టినా సినిమాలు భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవటంతో దర్శకుడు సుకుమార్ కూడా కమర్షియల్ హిట్ కోసం కలవరిస్తూ ఈ చిత్రంపై నమ్మకం పెట్టుకున్నాడు. అలాగే తమన్నా కూడా హ్యాపీ డేస్ తర్వాత తెలుగులో ఆమె స్ట్రైయిట్ గా ఏ చిత్రమూ చేయలేదు. దాంతో రీ ఎంట్రీ క్రింద ఈ చిత్రం హిట్ వైపు ఆమె ఎదురుచూపులు ఉన్నాయి. ఈ నేపధ్యంలో వారి ఆశలు, నమ్మకాలు, ఎదురుచూపులు ఈ చిత్రం ఏ మేరకు నెరవేర్చింది..ఎవరు ఎన్ని మార్కులు స్కోర్ చేసారు అంటే...

మనస్సు నిండా ప్రేమ పెట్టుకున్న ఓ యువజంట తమ ఇగోలను ప్రక్కన పెట్టి కలిసే ప్రయాణమే ఈ చిత్రం కథ. స్టేట్ ర్యాంకర్ బాలు(నాగచైతన్య)కి ఎప్పుడూ ఒకేటే ఆలోచన..తానే ఫస్ట్ రావాలి..గ్రేట్ అనిపించుకోవాలి. చదవు తప్ప వేరే విషయాలేమీ పట్టని అతని జీవితంలోకి అతని మరదలు మహాలక్ష్మి(తమన్నా)తుఫానులా ప్రవేశిస్తుంది. చదవుకోసం పల్లెనుంచి సిటీకి వచ్చిన ఆమె బాలు ఇంట్లో ఉంటూ అతని కాలేజీలోనే చేరుతుంది. మెదట్లో ఆమె ఇంగ్లీష్ మీడియం చదువుకు ఎడ్జెస్టు కాలేకపోయినా తర్వాత కష్టపడి ఫస్ట్ తెచ్చుకుని బాలుకి పోటీ ఇస్తుంది. తాను సెకెండ్ రావటం తట్టుకోలేని బాలు ఆమెని ఏడిపిస్తూ పోటీపడతాడు. అయితే అనుకోని విధంగా అజిత్ అనే మరో స్టూడెంట్ ఈ సారి ఫస్ట్ ప్లేస్ కొట్టుకుపోతాడు. ఊహించని ఈ పరిణామానికి షాక్ అయిన బాలు తన మరదలుతో కాంప్రమైజ్ అయ్యి ఆమెతో ఓ ఎగ్రిమెంట్ కి వస్తాడు. అజిత్ కాన్సర్టేషన్ ని దెబ్బతీయటానికి ఆమెను ఉసిగొల్పుతాడు. ఆమె అజిత్ ని ప్రేమ ప్రపోజల్ పెట్టి దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది. ఆ విషయంలో ఆమె సక్సెస్ అయ్యిందా...బాలు లో మార్పు వచ్చిందా..అనేది తెరపై చూడాల్సిందే.

కలవటం..విడిపోవటం..పొందటం అనే రెగ్యులర్ రొమాంటిక్ బీట్స్ కు అణుగుణంగానే సుకుమార్ స్క్రిప్టు తయారుచేసుకుని ఈ సారి తాను కన్ఫూజ్ కాకుండా ప్రేక్షకుడ్ని కన్ఫూజ్ కాకుండా కాపాడాడు. అలాగే తన స్పెషలైజేషన్ అయిన క్యారెక్టర్ డ్రైవన్ ఫిల్మ్ గానూ మరో ప్రక్క ఈ చిత్రాన్ని తీర్చిదిద్ది ఆయన అభిమానులును సంతృప్తి పరిచాడు. ఫస్టాఫ్ కాలేజి యువతకు నచ్చితే సెకెండాఫ్ ఫ్యామిలీలకు పట్టేలా కనపడుతోంది. ముఖ్యంగా ప్రి క్లైమాక్స్ వద్ద నాగచైతన్య బరస్ట్ అయ్యి తన ప్రేమను వ్యక్తం చేసే సీన్ చాలా బాగా వచ్చింది. హీరో తాతగా చేసిన విజయ్ కుమార్ పాత్ర బాగా కథలో కలిసి క్లైమాక్స్ కు లీడ్ చేయటం చాలా బాగా వచ్చింది. ఆయన పాత్ర కథలో కీలకమవ్వటం సుకుమార్ స్క్రిప్టుపై చేసిన కసరత్తు ఫలితమే అనిపిస్తుంది. అంతేగాక హీరో పాత్ర చివరదాకా తన క్యారెక్టేరషన్ ని వదలకుండా నిలబెట్టడం కూడా బాగా నచ్చే అంశం.

నటీనటుల్లో నాగచైతన్య..ఈజ్ బాగా ప్రదర్శించాడు.అయితే చైతన్య కన్నా తమన్నా డామినేట్ చేసిందని చెప్పాలి. సినిమా చూసిన తర్వాత ఆమె మీద టైటిల్ పెట్టి దటీజ్ మహాలక్ష్మి అంటే జస్టిఫై అయ్యేది అనిపిస్తుంది. మిగతా సీనియర్ ఆర్టిస్టుల గురించి కొత్తగా చెప్పుకునేది ఏమీ లేదు. కెమెరా పనితనం రెగ్యులర్ సుకుమార్ లాగానే చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా క్రిస్పుగా ఉంది. దర్శకుడుగా సుకుమార్ ఈ సినిమాలో విశ్వరూపం ప్రదర్శించాడని చెప్పాలి.

ఇక ఈ మధ్య కాలంలో రిలీజైన తీన్ మార్, మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రాలకీ ఈ సినిమాకి ఓ పెద్ద పోలిక ఉంది. అది సినిమాలో హీరో తనదైన భావాలతో ఎదుటివారు ప్రపచం పట్టించుకోకుండా నెగిటివ్ షేడ్ తో ఉండటం..సినిమా చివరకి హీరోయిన్ మంచితనం,ప్రేమ గుర్తించి ఆమె రూటులోకి రావటం. ఇక ఈ సమ్మర్ లో ఈ సినిమా వేసవి సెలవుల్లో ఉన్న స్టూడెంట్స్ కు మంచి వినోదాన్ని ఇస్తుంది. ఫ్యామిలీలకు కూడా బాగా నచ్చే అవకాశం ఉంది.

0 comments:

Post a Comment

VENNELA KUMAR

Followers