చిత్రం:'తీన్ మార్'
బ్యానర్: పరమేశ్వర ఆర్ట్స్
తారాగణం: పవన్ కళ్యాణ్, త్రిష, కృతి కర్బాందా
సినిమాటోగ్రఫీ: జయానన్ విన్సెంట్
కధ: త్రివిక్రమ్ శ్రీనివాస్
సంగీతం: మణిశర్మ
నిర్మాత: గణేష్ బాబు
దర్శకత్వం: జయంత్ సి పరాన్జీ
కధ:యాక్షన్ సినిమాలు చేయాలా, రొమాంటిక్ సినిమాలు చేయాలా,కామిడీలతో దూసుకుపోవాలా అన్న డైలమాలో ఉన్న పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా బ్యానర్స్ మారుస్తూ ఆల్టర్నేటివ్ ప్రయత్నాలు ఒక దానివెనక మరొకటి చేస్తున్నారు.అయితే ఏదీ భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కావటం లేదు. ఇలాంటి సందిగ్ధ పరిస్ధితుల్లో హిందీలో ఓ మాదిరిగా గా ఆడిన చిత్రాన్ని తీసుకు వచ్చి రీమేక్ చేయాలనుకోవటం సాహసమే. అయితే సాహసం చేసే వారికే విజయం లభిస్తుదని నిరూపించాడు.తను ఖచ్చింతగా నేటి యువతను ప్రతిబింబించే పాత్రలో పరకాయ ప్రవేశం చేయగలనని మరోసారి నిరూపించుకున్నాడు.లవ్ ఆజ్ కల్ రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం మళ్ళీ పవన్ కి కొత్త కెరీర్ ని ఇస్తుందనిపిస్తోంది.
డేటింగ్,బ్రేక్ అప్ అంటూ సూపర్ పాస్ట్ గా రిలేషన్ షిప్స్ లను మారుస్తూ పోయే నేటి జనరేషన్ కి ప్రతినిధి మైఖల్ వేలాయుధం(పవన్ కళ్యాణ్). కేప్ టౌన్ లో చెఫ్ గా పనిచేసే అతను మీరా(త్రిష)ని ఇష్టపడి డేటింగ్ మొదలెడతాడు.అయితే అది ఆమెతో బ్రేక్ అప్ చేసుకోవటానకి ఎంతో కాలం పట్టదు. ఆమెకు లాంగ్ రిలేషన్స్ ఎక్కువ కాలం నిలబడవని చెప్పి బ్రేక్ అప్ అయి వేరే అమ్మాయి మిస్చెల్ వెనక పడతాడు.అలాగే మీరా కూడా మరో వ్యక్తి సుదీర్ (సోనూసూద్) తో వివాహానికి సిద్దపడుతుంది. అలా వేరైన వారిద్దరూ తిరిగి ఎలా ఒకటయ్యారనేది మిగతా కథ.మరి మద్యలో పవన్ కళ్యాణ్ డబుల్ రోల్ అర్జున్ పాల్వాయ్ ఎవరూ అతని కథేంటి, అతనికీ కథకీ సంభందం ఏమిటీ అంటే అతను పాత్ర స్వచ్చమైన ప్రేమకు నిర్వచనంలా సాగుతుంది. ప్రేమకోసం ఎంతదూరమైనా, ఏమనా చేయటానకి రెడీ అవుతుంది. డబ్బైల్లో జరిగే ఈ ప్రేమకథ ఇప్పటి మైకల్ లో ఎలా మార్పు తీసుకువచ్చిందనేది తెరపై చూసి ఎంజాయ్ చేయాల్సిందే.
మల్టిప్లెక్స్ లో ఆడిన క్లాస్ సినిమాను తీసుకొచ్చి 'తీన్ మార్'అనే మాస్ టైటిల్ పెట్టి పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్నాడనగానే ఎప్పటిలాగే చాలా మంది ఆశ్చర్యపోయి..గబ గబా అనుమానాలు వ్యక్తం చేసారు. మరికొంతమంది మరింత ముందుకు వెళ్ళి పెదాలు కూడా విరిచేసారు.దానికి తోడు దాదాపు ఫేడవుట్ అయిపోయిన దర్శకుడు జయంత్ ని తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు అప్పచెప్పటంతో చాలా మంది ఇది మరో జాని అని కొమురం పులి కి సీక్వెల్ అని ఫిక్స్ అయిపోయారు.అయితే కార్బన్ కాపీ లా హిందీ చిత్రాన్ని మక్కికి మక్కీ అనువదించి అందించటానికి ఎవరైతేనేం అని పవన్ నిర్ణయించుకుని ఈ పని చేసినట్లు చిత్రం చూస్తే మొదట అర్దమయ్యే విషయం. అలాగే ఖుషీ లాంటి హిట్ రావాలంటే అలాంటి సినిమానే చేయాలి, ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలనే పవన్ ఈ రొమాంటిక్ కామిడీని ఎన్నుకున్నాడని స్పష్టమవుతుంది. అలాగని సినిమా బాగోలేదని కాదు లవ్ ఆజ్ కల్ చూసిన వారికి కొత్తగ ఏమీ అనిపించదు.
ఇక స్క్రిప్టు పరంగా చూస్తే ప్రధాన పాత్ర మైకెల్, మీరా మధ్య రొమాంటిక్ కామిడిగా నడిచే ఈ చిత్రంలో ఆ బీట్స్ అన్ని కనపడతాయి. అయితే లవ్ ఆజ్ కల్ లో రిషీ కపూర్ పాత్రను తీసేసి పవన్ నే మళ్ళీ పెట్టడం బాగున్నట్లు అనిపించదు.ఇక త్రివిక్రమ్ పంచ్ డైలాగులు సినిమాకు ప్రాణమై నిలిచాయి. పవన్ నటన విషయానికి వస్తే అర్జున్ పాల్వాయ్ గా అతను జీవించాడనే చెప్పాలి. అలాగే తను ప్రేమించిన అమ్మాయి(కృతి కర్భందా) తండ్రితో మాట్లాడే సీన్ లో పవన్ నటన సినిమాకే హైలెట్ అనిపిస్తుమంది. సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ ఖుషీ నాటి పవన్ కళ్యాణ్ ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ కనపడ్డం ఆశ్చర్యపరిచే అంశం.
పాటల్లో "ఆలె ఆలె ఆలె ఆలె" పాట ఆడియోపరంగానూ,విజువల్ గానూ ఉన్నత స్ధాయిలో ఉంది.కాశీ నేపధ్యంలో వచ్చే సాంగ్ బయిట కూడ హిట్టై ధియోటర్లో విజిల్స్ వేయించింది. రీ రికార్డింగ్, ఎడిటింగ్, కొరియోగ్రఫి వంటి శాఖలు చాలా బాగా కుదిరాయి. ముఖ్యంగా ఆర్ట్ డిపార్టమెంట్ పనితీరుని మెచ్చుకోవాలి.ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో అప్పటి మన దేశాన్ని చాలా బాగా చూపించారు. ఇక పవన్ ఫ్యాన్స్ కు, మల్టిప్లెక్స్ ప్రేక్షకులకు బాగా నచ్చే ఈ చిత్రంలో రెండు పాత్రలలోనూ విభిన్నత చూపించి పవన్ అదరకొట్టాడనటంలో సందేహం లేదు.
చూడ్డానికి బాగా క్లాస్ గా,స్లో నేరషన్ తో ఉన్నా ఖుషీ లాగే మెల్లిగా టాక్ పుంజుకుని బాగా ఆడే అవకాశం ఉందనిపిస్తుంది.అందులోనూ వరస ఫ్లాప్ లతో ఉన్న పవన్ కి తాను ఎలాంటి సినిమాలు చేస్తే కంఫర్ట్ గా చేయగలడో, జనాలకు నచ్చుతుందో క్లారిటీ వచ్చే అవకాశం ఉందనిపిస్తుంది. మొత్తం మీద వేసవి ఎండల్లో చల్లటి అనుభూతినిచ్చే ఆహ్లాద చిత్రం ఇది. లవ్ ఆజ్ కల్ చూడకపోతే నిరభ్యంతరంగా ఫ్యామిలీతో వెళ్ళి చూసి ఎంజాయ్ చేయవచ్చు.

0 comments:
Post a Comment